BMW Hits Auto Trolley: ఆటో ట్రాలీని ఢీకొన్న బీఎండబ్ల్యూ కారు.. నుజ్జు నుజ్జు.. డ్రైవర్‌కి ఏమైందంటే? (video)

సెల్వి

శుక్రవారం, 14 ఫిబ్రవరి 2025 (18:34 IST)
BMW Car
సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. ముందు వెళ్తున్న ఆటో ట్రాలీని బీఎండబ్ల్యూ కారు ఢీకొంది. ఈ ఘటనలో బీఎండబ్ల్యూ కారు ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యింది. వివరాల్లోకి వెళితే, కొల్లూరు నుంచి పటాన్ చెరు వెళ్తున్న బీఎండబ్ల్యూ కారు ముందు వెళ్తున్న ట్రాలీ ఆటోను ఢీకొంది. 
 
ఈ ప్రమాదంలో టైర్లు ఊడి పోగా, ఇంజిన్ తప్పితే మిగతా భాగం అంతా పాడైంది. కారు డ్రైవర్ స్టీరింగ్ సీటులోనే ఇరుక్కుపోగా, బెలూన్స్ ఓపెన్ కావడంతో ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. అతనికి తీవ్రగాయాలనైట్లు పోలీసులు తెలిపారు. స్థానికులు ఆతనిని ఆస్పత్రికి తరలించారు. 
 
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అతివేగం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని.. ఈ మధ్య ఔటర్ రింగ్ రోడ్డులో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు పోలీసులు చెప్తున్నారు.

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఔటర్ రింగ్ రోడ్ పై ఘోర రోడ్డు ప్రమాదం

ముందు వెళ్తున్న ఆటో ట్రాలీ ని కొట్టిన బీఎండబ్ల్యూ కారు

నుజ్జునుజ్జైన బీఎండబ్ల్యూ కారు

కారు డ్రైవర్ కు స్వల్ప గాయాలు pic.twitter.com/GVqSCYjvXT

— Radha Vara Lakshmi (@radhachinnulu) February 14, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు