కేటీఆర్ ప్రసంగాన్ని కాంగ్రెస్ సభ్యులు అడ్డుకున్నారు. మంత్రులు పొన్నం, భట్టి విక్రమార్క మైక్ తీసుకుని కేటీఆర్ మాట్లాడుతున్న తీరుపై విమర్శలు గుప్పించారు. సభను ప్రజాస్వామ్యయుతంగా నడపాలని నిర్ణయించుకున్నామని, అయితే కేటీఆర్ మాట్లాడుతున్న తీరు అలా లేదని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు.
గత ప్రభుత్వాల నిర్ణయాల గురించి మాట్లాడవద్దని, ఇప్పుడు జరుగుతున్న వాటి గురించి మాట్లాడాలని కేటీఆర్కు సూచించారు. కాంగ్రెస్ సభ్యులు ఇందిరమ్మ పాలనపై మాట్లాడితే తమ హయాంలో జరిగిన అరాచకాల గురించి కూడా మాట్లాడతారని కేటీఆర్ స్పష్టం చేశారు.
కాంగ్రెస్కు 64 సీట్లు ఉంటే, తమకు కూడా 39 సీట్లు ఉన్నాయని, ఓట్ల షేరింగ్లో పెద్దగా తేడా లేదని గుర్తు చేశారు. విద్యుత్ అప్పులతోపాటు పలు అంశాలను కేటీఆర్ వివరించారు. ఆరోగ్య రంగాన్ని పూర్తిగా అభివృద్ధి చేశామని, జిల్లా వైద్య కళాశాలను ఏర్పాటు చేశామన్నారు.
రాష్ట్రం ఏర్పడేనాటికి 5 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవని గుర్తు చేశారు. కొత్త సచివాలయం, ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కూడా కేసీఆర్ ప్రభుత్వమే నిర్మించిందని అన్నారు. పౌరసరఫరాల శాఖకు సంబంధించి గవర్నర్ ప్రసంగంలో అవాస్తవాలు చెప్పారన్నారు.