టెన్త్ విద్యార్థులకు స్టడీ అవర్‌లో స్నాక్స్... మెనూ ఇదే...

ఠాగూర్

మంగళవారం, 4 ఫిబ్రవరి 2025 (17:12 IST)
తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులు పబ్లిక్ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా, టెన్త్, ఇంటర్ ఫైనల్ ఇయర్ పరీక్షలకు చెందిన విద్యార్థులు ముమ్మరంగా ప్రిపేర్ అవుతున్నారు. ఈ కోవలో పదో తరగతి విద్యార్థులకు స్టడీ అవర్‌లో చిరుతిండ్లు అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన తాజాగా మోనూ రూపొందించి ఉత్తర్వులు కూడా జారీచేశారు. 
 
ఈ మెనూ ప్రకారం తృణధాన్యాలతో చేసిన బిస్కెట్లు, పల్లీ చిక్కీ, ఉడకబెట్టిన బొబ్బర్లు, ఉల్లిపాయ పకోడీలు, ఉడకబెట్టిన పెసర్లు, శెనగలు - ఉల్లిపాయ వంటి వంటకాలను రోజుకొకటి చొప్పున విద్యార్థులకు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. 
 
ఈ స్నాక్స్ కోసం ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.15 చొప్పున ఖర్చు చేయనున్నారు. ఇందుకోసం స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ ఖాతాలకు నిధులు చేయనున్నారు. మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు టెన్త్ క్లాస్ పరీక్షలు జరుగనున్నాయి. దీంతో ఈ నెల ఒకటో తేదీ నుంచి మార్చి 20వ తేదీ వరకు విద్యార్థులకు సాయంత్రం వేళల్లో స్టడీ అవర్స్‌లో స్నాక్స్ అందించనున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు