ఈ సమావేశానికి తెరాసకు చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తప్పనిసరిగా హాజరు కావాలని సీఎం ఆదేశించారు.
ఆయా జిల్లాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సమన్వయం చేసుకొని సమావేశానికి తీసుకురావాల్సిందిగా మంత్రులకు సీఎం సూచించారు.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై అధికారులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు జీహెచ్‌ఎంసీ పరిధిలోని డివిజన్ల బాధ్యతలు అప్పగించారు. ఇందుకు సంబంధించిన డివిజన్ల వివరాలను నేతలకు ఇప్పటికే అందించారు.
అభ్యర్థులను ప్రకటించిన తర్వాత అసమ్మతి నేతలతో ఎలా వ్యవహరించాలి, విపక్షాల ప్రచారాన్ని ఎలా తిప్పికొట్టాలి, ఏయే అంశాలను ప్రచారంలోకి తీసుకెళ్లాలనే అంశాలపై రేపటి సమావేశంలో పార్టీ నేతకు కేసీఆర్ స్పష్టతనివ్వనున్నారు.