హైదరాబాద్ ఫుడ్ మెనూలో బిర్యానీ వుంటుంది. హైదరాబాద్ బిర్యానీ అంటే వరల్డ్ ఫేమస్ వంటకం. హైదరాబాద్‌లో బిర్యానీ దొరకని ప్రాంతమే ఉండదు. అందుకే చిన్న చిన్న రెస్టారెంట్లతో పాటు బడా బడా స్టార్ హోటల్స్‌లోనూ బిర్యానీ ఘుమఘుమలు కనిపిస్తుంటాయి. అయితే కరోనా లాక్డౌన్ కారణంగా నగరంలోని చాలా హోటల్స్ బిజినెస్ లేక డల్ అయిపోగా... తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికలు మళ్లీ బిర్యానీ బిజినెస్‌కు కొత్త బూస్ట్ ఇచ్చాయి.
మార్చి నుంచి ఆగస్టు వరకు హైదరాబాద్‌లోని దాదాపు సగానికిపైగా రెస్టారెంట్లు మూతబడగా.. ఈ నెలలో పరిస్థితి బాగా మెరుగైంది. తాజాగా ఎన్నికల ప్రచార సమయంలో కార్యకర్తలకు, మద్దతుదారులకు నాయకులు బిర్యానీ వంటకమే ఎక్కువగా ఏర్పాటు చేస్తుంటారు.
కరోనా కేసుల సంఖ్య కూడా తగ్గడంతో హోటళ్లకు వెళ్తున్న వారి సంఖ్య కూడా భారీగా పెరిగింది. లాక్ డౌన్‌తో అద్దెలు కట్టలేక, సిబ్బందికి జీతాలివ్వలేక ఇబ్బందులు పడ్డ హోటళ్ల యజమానులు ఇప్పుడు మళ్లీ బిజినెస్‌తో బిజీ అవుతున్నారు.