ఐతే సహజీవనం బ్రేకప్ అయ్యాక తన డబ్బులు తనకు ఇవ్వాలని అడుగుతూ వుంది. అతడు ఎంతకూ ఇవ్వకపోయేసరికి పోలీసు కేసు పెట్టింది. అప్పుగా డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీస్ స్టేషన్‌కు వచ్చిన అతగాడిని చెప్పుతో కొడుతూ నువ్వు ఏమన్నా నా మొగుడివా? నా డబ్బులు తిరిగి ఇవ్వవా అంటూ నిలదీసింది. పోలీసుల ముందే అతడిని చెప్పుతో చితకబాదడంతో అక్కడివారు అవాక్కయ్యారు.