మహబూబాబాద్ డోర్నకల్ మండలం పెరుమాండ్ల సుంకిశ గ్రామంలో ఓ గ్రామస్థుడి ఇంటి ముందు గుర్తుతెలియని వ్యక్తులు చేతబడి చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కిన్నెర మధు నివాసంలో దుండగులు చేతబడులు చేశారని తెలుస్తోంది. పసుపు, సూదులతో కూడిన బొమ్మను కనుగొనడంతో నివాసితులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.