భువనగిరి పట్టణంలోని ఓ రేషన్ షాప్‌ను ఆయన సందర్శించారు. కేంద్ర ప్రభుత్వం అందించే ఉచిత బియ్యం పేదలకు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో కుటుంబ, నియంత పార్టీ టీఆర్ఎస్ పాలనకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. హుజూరాబాద్‌లో బీజేపీని గెలిపించాలని కోరారు. ప్రజలు నిజాం పాలన, ఎఐఎం తొత్తుగా ఉన్న టీఆర్ఎస్ ను బుద్ధి చెప్తారని అన్నారు.
తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని మంత్రి స్పష్టం చేశారు. తొలిసారిగా మోదీ మంత్రివర్గంలో సామాజిక సమతుల్యత పాటించాలని అన్నారు. తెలంగాణ అభివృద్ధికి ప్రధాని మోడీ సర్కార్ కట్టుబడి ఉందన్న ఆయన.. భవిష్యత్తులో ఇద్దరో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించినా టీఆర్ఎస్‌లోనే చేరుతారని జోస్యం చెప్పారు.