విద్యారంగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం హైదరాబాద్ ధర్నాచౌక్‌లో డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్(డీటీఎఫ్) ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నా చేశారు. దీనికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన కొనసాగుతోందన్నారు.
ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయాలని, స్వచ్ఛ కార్మికులను నియమించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆచార్య హరగోపాల్ మాట్లాడుతూ.. తెరాస ప్రభుత్వం విద్య, వైద్య రంగాలను ప్రైవేటు దోపిడీకి వదిలేసిందని ఆరోపించారు.