కరోనా వైరస్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా, రష్యా నుంచి దిగుమతి చేసుకున్న స్పుత్నిక్ వి టీకాల పంపిణీ సోమవారం నుంచి ప్రారంభమైంది. ప్రస్తుతంత కొవిడ్‌పై పోరుకు కొవిషీల్డ్, కొవాగ్జిన్‌తో పాటు భారత్‌లో అత్యవసర వినియోగానికి ఈ స్పుత్నిక్-వి అందుబాటులోకి వచ్చింది.
హైదరాబాద్, విశాఖపట్నంలలో ఏకకాలంలో ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైంది. స్పుత్నిక్-వి వ్యాక్సిన్‌ను భారత్‌లో తయారీ, పంపిణీకి డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌తో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.