ఇక అసలు విషయానికి వస్తే... ఈరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తారు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ అవసరమనీ, అలాంటి నాయకుడు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా వుండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
ఇటీవలే ప్రభుత్వం ఉద్యోగ నియామకాలపై తీసుకున్న నిర్ణయంపై స్పందిస్తూ... పోలీసు, మెడికల్, విద్యా విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయడం మంచి నిర్ణయం అంటూ ప్రశంసించారు. మొత్తమ్మీద ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆకాశానికెత్తేశారు ఎమ్మెల్యే అక్బరుద్దీన్.