గత యేడాది జూన్ నెల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదే కావడం గమనార్హం. అదేవిధంగా పాలమూరు జిల్లా కురవి మండలం అయ్యగారిపల్లె, జగిత్యాల జిల్లాలోని అలీపూర్‌లలో ఆదివారం 40 డిగ్రీల మేరకు పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఇకపోతే, ములుగు, ఖమ్మం, జిల్లాలోనూ ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పెరిగిపోతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో సాధారణం కంటే 1.6 డిగ్రీలో, భద్రాచలంలో 1.5 డిగ్రీలో అధికంగా నమోదయ్యాయి.