2 కిలోమీటర్ల లోతులో ఆ జల విద్యుత్ కేంద్రం

శనివారం, 22 ఆగస్టు 2020 (12:21 IST)
శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్‌ కేంద్రం ఉండేది ఎక్కడో తెలుసా? శ్రీశైలం ప్రాజెక్టు ఉపరితలం నుంచి దాదాపు 2 కిలోమీటర్ల లోతున అది నిర్మితమైంది.

1989లో రూ.3500 కోట్ల జపాన్‌ ఇంటర్నేషనల్‌ కో-ఆపరేషన్‌ ఏజెన్సీ (జైకా) సమకూర్చిన రుణంతో ఈ ప్రాజెక్టును కట్టారు. 2001లో తొలి యూనిట్‌లో విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభించగా... 2004 దాకా ఒక్కొక్కటి 150 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఆరు యూనిట్లలో ఉత్పత్తి మొదలైంది.

జెన్‌కోకు 11 చోట్ల జలవిద్యుత్‌ కేంద్రాలు ఉన్నాయి. వాటన్నింటి సామర్థ్యం 2,441.8 మెగావాట్లు కాగా, ఒక్క శ్రీశైలం జల విద్యుత్‌ కేంద్రం సామర్థ్యమే 900 మెగావాట్లు. అందుకే దీన్ని బాహుబలి విద్యుత్‌ కేంద్రంగా పిలుస్తుంటారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు