హైదరాబాద్ మహానగరంలో విద్య, ఉద్యోగం, ఉపాధి నిమిత్తం నిత్యం లక్షలాదిమంది ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగిస్తుంటారు. వీరికి వివిధ కేటగిరీల రాయితీలపై టీఎస్ఆర్టీసీ బస్‌పాస్‌లు ఇస్తోంది. గ్రేటర్ పరిధిలో ఇలా బస్‌పాస్‌లు తీసుకునేవారు 9 నుంచి 10 లక్షల మంది ఉంటారని అంచనా. ఇందులో స్టూడెంట్ పాస్‌లు, ఉద్యోగస్తుల నెలవారీ పాసులే అధికం. బస్‌పాస్‌ల ద్వారే ఆర్టీసీకి నిత్యం రూ.80 లక్షల వరకు ఆదాయం సమకూరేది.