ముమైత్‌కు ఎక్స్‌పోజింగ్ చేసి బోర్ కొట్టిందట.. అందుకే..
WD
ఐటంగర్ల్ నుంచి లేడీ ఓరియెంటేడ్ చిత్రాల స్థాయికి ఎదిగిన సెక్సీతార ముమైత్‌ఖాన్ హాట్‌ఇమేజ్ నుంచి గృహిణి ఇమేజ్ తెచ్చుకోవాలని చూస్తోంది. హీరోయిన్‌గా నటించాలని ముమైత్ ఎంతో ఆశగా ఉంది.
అందుకే గత ఆరు నెలలుగా 18కేజీల బరువు తగ్గానంటోంది. ఇంకా రెండునెలల్లో ఇంకా బరువు తగ్గుతానని ఆ తర్వాత చూస్తే మీరే ఆశ్చర్యపోతారని అంటోంది.
ఇదంతా న్యూట్రిషనిస్ట్ సలహాలమేరకే జరిగిందని ముమైత్ వెల్లడించింది. తాజాగా హిందీ, తెలుగు భాషల్లో పేరు నిర్ణయం కాని చిత్రంలో చీరకట్టుకుని నటించింది. ఇక నుంచి తాను నటించే చిత్రాలు పిల్లలకు కూడా ఇష్టపడేలా జాగ్రత్తలు తీసుకుంటానని అంటోంది.
ఇటీవలే "మగధీర"లో ఐటంసాంగ్ చేసింది. మరోవైపు కందస్వామి (తెలుగులో మల్లన్నలోనూ) నటించింది. ఈ రెండు చాలా ప్రతిష్టాత్మకమైన చిత్రాలని ముమైత్ చెబుతోంది. ఈ రెండు చిత్రాల ద్వారా తనకు మంచి గుర్తింపు వస్తుందని ఈ సెక్సీతార విశ్వాసం వ్యక్తం చేస్తోంది.
ఇకపోతే.. సింధు తులాని, రాజీవ్ కనకాల కాంబినేషన్‌లో వస్తోన్న "పాయిజన్" చిత్రంలోనూ కీలక పాత్రను పోషించానని, ఈ పాత్ర మాస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని ముమైత్ వెల్లడించింది.