దర్శకుడు రవిరాజా పినిశెట్టి తనయుడుగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన హీరో ఆది పినిశెట్టి. ఆరంభంలో హీరోగా కనిపించారు. అయితే, ఆయనకు హీరోగా సినీ అవకాశాలు పెద్దగా రాకపోవడంతో విలన్గా మారిపోయాడు. విలన్ పాత్రల్లో పలు చిత్రాల్లో కనిపించారు. ముఖ్యంగా, అల్లు అర్జున్ నటించిన సరైనోడు చిత్రంలో ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా అద్భుతంగా నటించాడు.
గతంలో వీరిద్దరి కాంబినేషన్లో 'మలుపు', 'మరకతమణి' అనే చిత్రాలు వచ్చాయి. ఆ తర్వాత అంటే గత కొంతకాలంగా వీరిద్దరూ డేటింగ్లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన రవిరాజా పినిశెట్టి బర్త్డే వేడుకల ఫొటోల్లో కూడా నిక్కీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.