తెలుగు చిత్ర పరిశ్రమలో సరికొత్త చర్చకు తెరలేసింది. దర్శకుడు జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'గౌతమిపుత్రశాతకర్ణి'. బాలకృష్ణ హీరో. వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, యుద్ధ పోరాటాలతో, అత్యంత సాంకేతిక విలువలతో కేవలం 8 నెలల్లోనే తెరకెక్కించారు. ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను ఇటీవలే విడుదల చేశారు.
కానీ, దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి 'బాహుబలి-1'ని ఒక సంవత్సరంపాటు శ్రమించి నిర్మించాడు. అలాగే, 'బాహుబలి-2'ను కూడా గత యేడాదిన్నర కాలంగా నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో కూడా యుద్ధపోరాటాలు ఉన్నాయి. కానీ రాజమౌళి ఒక చిత్రాన్ని నిర్మించేందుకు సంవత్సరాల తరబడిన సమయం తీసుకుంటున్నారు. అదే క్రిష్ విషయానికి వస్తే కేవలం కొన్ని నెలల్లో మాత్రమే నిర్మాణం పూర్తి చేశారు. ఇదే ఇపుడు చర్చనీయాంశంగా మారింది.
టాలీవుడ్‌లో 'కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు" అన్నది ప్రశ్న. ఈ లైన్ ఎంత పాపులర్ అయిందో చెప్పక్కర్లేదు. ఈ లైన్‌పై సోషల్ మీడియాలోనే కాదు, పబ్లిక్ లైఫ్‌లోనూ ఎన్నో సెటైర్లు. అయితే, లేటెస్ట్‌గా వచ్చిన "గౌతమిపుత్రశాతకర్ణి" ట్రైలర్ ఈ పాపులర్ లైన్ మార్చేస్తోంది. డైరెక్టర్ క్రిష్ కేవలం ఏడు నెలల్లోనే గౌతమిపుత్ర షూటింగ్ ఫినీష్ చేసి అబ్బురపరిచే గ్రాఫిక్స్.. టెక్నికల్ వాల్యూస్‌తో అద్భుతమైన విజువల్ వండర్‌లా సినిమాని తీర్చిదిద్దాడు. దీనికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశాడు క్రిష్. అంతే.. అది చూసిన సీనీజనాలు ఒక్కసారిగా రూటుమార్చారు. ఈ ట్రైలర్‌లో బాలకృష్ణ .. 'సమయంలేదు మిత్రమా..' అంటూ చెప్పిన డైలాగ్ కట్టప్పకు అన్వయించారు.