తెలంగాణ రీజియన్లో రాబిన్‌హుడ్‌గా పేరున్న పండుగల పాయన్న కథను ఈ సినిమా ద్వారా తెరపైకి తీసుకువస్తున్నారట. పీరియాడిక్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారట. మణికర్ణిక క్రెడిట్‌ని కంగన రనౌత్ కొట్టేయడం.. ఎన్టీఆర్ బయోపిక్ ఫ్లాప్ కావడం వంటి కారణాలతో విసిగిపోయిన క్రిష్ వీటన్నింటికి సమాధానం చెప్పాలనే కసితో ఈ చిత్ర నిర్మాణానికి రాజీ పడడం లేదట.