ఈ వార్తలను నిజం చేసేలా మలైకా అరోరా సోషల్ మీడియాలో హింట్ ఇచ్చింది. మలైకా అరోరా అర్జున్ కపూర్ కుటుంబాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసింది. ఆమె అర్జున్ కపూర్ సోదరీమణులు, అన్షులా కపూర్, జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌లను ఫాలో చేయలేదు.
ఇకపోతే.. అర్జున్ కపూర్ తాజాగా మోడల్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కుషా కపిల వెంట పడినట్లు తెలుస్తోంది. అయితే ఆ పుకార్లను ఆమె ఖండించారు. అర్జున్ కపూర్‌తో తాను డేటింగ్ చేయడం లేదని చెప్పింది. 49 ఏళ్ల మలైకాకు ఆమె మునుపటి వివాహం నుండి ఒక కుమారుడు ఉన్నాడు.