గేమ్ ఛేంజర్ మూవీ రిజల్ట్‌పై దిల్ రాజు సోదరుడు, నిర్మాత శిరీష్ రెడ్డి స్పందించారు. నితిన్ హీరోగా నటించిన తమ్ముడు సినిమా ప్రమోషన్లలో భాగంగా మాట్లాడిన ఆయన గేమ్ ఛేంజర్ సినిమా తర్వాత రామ్ చరణ్ కానీ, డైరెక్టర్ శంకర్ కానీ కనీసం తమకు ఫోన్ కూడా చేయలేదన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో నిర్మాత శిరీష్ రెడ్డి మెగా కుటుంబంతో తమకు ఎలాంటి వివాదం లేదన్నారు. గేమ్ చేంజర్ సినిమా కోసం మాకు రామ్ చరణ్ తన పూర్తి సమయం, సహకారం అందించారని శిరీష్ రెడ్డి అన్నారు.