అనుపమ పరమేశ్వరన్ ఏ ముహూర్తంలో తెలుగు తెరకి పరిచయమైందో గానీ, హిట్స్ సినిమాలు తన ఖాతాలో వేసుకుంటోంది. దీంతో అనుపమను అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇప్పటికే అ.. ఆ, శతమానం భవతి, ప్రేమమ్ వంటి సినిమాల్లో నటించిన అనుపమ రామ్‌కు జోడీగా 'ఉన్నది ఒకటే జిందగీ' సినిమా చేస్తోంది. ఈ సినిమా పూర్తవగానే నానితో అనుపమ జత కట్టనుంది.