ఉపాధ్యాయులను కించపర్చేలా వ్యాఖ్యలు చేసిన దర్శకుడు రాంగోపాల్వర్మపై పలువురు ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దర్శకుడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు వర్మ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టీచర్లను నమ్ముకోవద్దు గూగుల్ని నమ్మండి అంటూ వర్మ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.