తాజాగా మీడియాతో మాట్లాడుతూ తాను ఇక ఏ సినిమాని కూడా ఫస్ట్ డే సినిమా హాల్‌కు వెళ్లిచూడబోనని తేల్చి చెప్పింది. ఈ నిర్ణయాన్ని ఎందుకు తీసుకుందో కూడా చెప్పేసింది. ఇటీవలే ఆమె నటించిన సినిమా ''జనతా గ్యారేజ్'' ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాను తాను తొలిరోజే థియేటర్లకు వెళ్లి చూసిందట.
అయితే, థియేటర్లలోని అభిమానుల్లో కొందరు సదరు సినిమాలు బాగోలేవని, ఎక్కువ రోజులు ఆడవని అనుకున్నారట. అభిమానుల మాటలు తన చెవిలో పడటంతో తాను విరక్తి చెందినట్లు పేర్కొంది. అభిమానులు అనుకున్న విధంగా ఆ సినిమాలు ప్లాప్ కాలేదని, సూపర్‌హిట్ అయ్యాయని చెప్పింది. అందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు మీడియాతో చెప్పిందీ కుందనపు బొమ్మ.