విడాకులు తీసుకున్నాక అమలాపాల్‌కు లైంగిక వేధింపులు, ఎవరు?

బుధవారం, 1 డిశెంబరు 2021 (19:43 IST)
కోలీవుడ్ బ్లాక్ బ్యూటీ, ఇద్దరమ్మాయిలతో హీరోయిన్ అమలాపాల్ ప్రస్తుతం లైంగిక వేధింపులను ఎదుర్కొంటుంది. కోలీవుడ్ డైరెక్టర్ ఏఎల్‌. విజయ్‌ను ప్రేమ పెళ్లి చేసుకున్న  అమలాపాల్...పెళ్లయ్యాక యేడాదికే వీరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. ఆ తర్వాత విజయ్ మరో పెళ్లి కూడా చేసుకున్నా.. అమల మాత్రం ఇంకా సింగిల్ గానే ఉంటోంది.
 
విడాకుల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన అమల మళ్లీ సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంది. విడాకుల తర్వాత కొందరు అమలాపాల్‌ను లైంగికంగా వేధించడం స్టార్ట్ చేశారట. 
 
ఇండస్ట్రీకి చెందిన పలువురు ఆమెను లైంగిక వేధింపులకు గురిచేయడంతో.. ఆమె విసిగిపోయి.. పోలీసులను ఆశ్రయించిందని టాక్ వస్తోంది. అయినా ఆమెకు వేధింపులు తగ్గలేదని తెలిసింది. ఆమెను వేధింపులకు గురిచేసింది ఎవరో కాదు.. ఇండస్ట్రీకి చెందిన ప్రముఖలేనని వెల్లడి అయ్యింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు