విజయ్ దేవరకొండ అంటే ఇప్పుడు యూత్‌కు ఎంతో క్రేజ్. అయితే విజయ్ సరసన నటించేందుకు దాదాపు పాతిక మంది హీరోయిన్లు నో చెప్పారంటే నమ్ముతారా. ఇది నిజంగానే జరిగిందట. పెళ్ళి చూపులు సినిమా హిట్ కాగానే గీత గోవిందం సినిమాను ప్లాన్ చేశారు. విజయ్ సరసన నటించేందుకు టాలీవుడ్ లోని అగ్రహీరోయిన్లు, మిడిల్ రేంజ్ హీరోయిన్లను అప్రోచ్ అయ్యారట. కానీ వారంతా ఈ అప్‌కమింగ్ స్టార్‌తో నటించలేమని రిజెక్ట్ చేసేశారట.
గీత గోవిందం హిట్టయిన తరువాత టాప్ హీరోయిన్లు విజయ్‌తో నటించేందుకు పోటీలు పడుతున్నారట. ఇప్పటికే సమంత నటించగా త్వరలో రాశీ ఖన్నా, ఆ తరువాత కాజల్ ఇలా ఒక్కొక్కరుగా విజయ్ దేవరకొండతో నటించేందుకు క్యూ కడుతున్నారట. తెలుగులోనే కాదు తమిళంలోను విజయ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారట.