టాలీవుడ్‌లో అవకాశాలు రాకుండా ఉన్న ఆర్టిస్ట్‌లు చాలామంది ఇండస్ట్రీలో ఉన్నారని.. సీనియర్ నటి హేమ తెలిపారు. నటించే అవకాశాలు రావడం, రాకపోవడమనేది మన చేతుల్లో ఉండదని మన చేతుల్లో ఉండదని.. బట్టలు విప్పేసుకుంటే వేషాలిస్తారనుకోవడం తప్పని హితవు పలికింది. శ్రీరెడ్డి లాంటి వాళ్లను ఎంకరేజ్ చేయొద్దని మీడియాను కోరుకుంటున్నానని నటి హేమ తెలిపారు.
శ్రీరెడ్డి వ్యవహారంపై స్పందించకపోవడానికి కారణం.. ఆమె వ్యవహరిస్తున్న తీరేనని చెప్పింది. గతంలో జరిగిన బోర్డు మీటింగ్‌లో ఓ పెద్ద డైరక్టర్‌పై ఓ అమ్మాయి తమకు ఫిర్యాదు చేసిందని, ఆ దర్శకుడిని పిలిపించాము కానీ, ఫిర్యాదు చేసిన ఆ అమ్మాయి రాలేదని హేమ చెప్పారు.
శ్రీరెడ్డి ''మా'' కార్డు కావాలని అడుగుతున్న శ్రీరెడ్డికి అప్లికేషన్ ఇచ్చామని.. ఆ ఫామ్‌ను సరిగ్గా నింపలేదని.. అందుకే తిరస్కరించామని తెలిపారు. సినిమాల్లో తనకు వేషాలు ఇవ్వడం లేదని శ్రీరెడ్డి అనడం సబబు కాదని, తనకు కూడా చాలా కాలంగా నటించే అవకాశాలు రావడం లేదని, అలా అని చెప్పి ఇండస్ట్రీపై ఫిర్యాదు చేస్తానా? అని అడిగారు. శ్రీరెడ్డిది చీప్ పబ్లిసిటీ అని హేమ తెలిపారు.