త‌ల్లి అయ్యేందుకు టైమ్ ఉందంటోన్న హీరోయిన్

బుధవారం, 11 ఏప్రియల్ 2018 (10:21 IST)
త‌న అందం, అభిన‌యంతో ఆక‌ట్టుకుని అన‌తి కాలంలోనే ప్రేక్ష‌క హృద‌యాల‌ను దోచుకుని మంచి గుర్తింపు సొంతం చేసుకున్న హీరోయిన్ సమంత. ఇటీవ‌ల మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో "రంగ‌స్థ‌లం" సినిమాలో న‌టించి మ‌రోసారి త‌న న‌ట‌న‌తో శ‌భాష్ అనిపించుకుంది. 
 
ఇదిలావుంటే... స‌మంత త‌ల్లి కాబోతుంది అంటూ వ‌చ్చిన వార్త‌లపై ఆమె స్పందించింది. తాను, తన భర్త నాగ చైతన్య పిల్లల గురించి ఇప్పుడే ఆలోచించట్లేదని, పిల్లల్ని కనేందుకు ఓ టైమ్‌ అనుకున్నామని తెలిపింది.
 
ఆ టైమ్‌ వచ్చేవరకు తమ కెరీర్‌ గురించే తప్ప వేరే ఆలోచనలు చేయకూడదనుకున్నామని చెప్పింది. కాగా, ఒక్కసారి తాను తల్లిగా మారితే, ఇక తనకు పిల్లలే ప్రపంచమని తెలిపింది. సమంత న‌టించిన‌ "మహానటి" మే 9వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రానుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు