ఓటీటీలో విశ్వక్ సేన్ "అశోకవనంలో అర్జున కళ్యాణం"

శుక్రవారం, 3 జూన్ 2022 (16:32 IST)
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన నటించిన కొత్త చిత్రం "అశోకవనంలో అర్జున కళ్యాణం". ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే పలు వరుస చిత్రాల విజయంతో మంచి జోష్ మీదున్న విశ్వక్ సేన్ ఇపుడు విభిన్నమైన టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకువచ్చిన విషయం తెల్సిందే. 
 
రొమాంటింక్ కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం గత నెల 6వ తేదీన విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇందులో విశ్వక్ సేన్ అర్జున పాత్రలో ఒదిగిపోయిన తీరుకు విమర్శకులు సైతం ప్రసంశలు కరిపించారు. 
 
ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయనున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో జూన్ 3వ తేదీ నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. విద్యా సాగర్ చింతా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విశ్వక్ సేన్ జోడీగా రుక్సార్ ధిల్లాన్, రితికా నాయక్‌లు హీరోయిన్లుగా నటించారు. 
 
బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో ఎస్.వి.సి.సి పతాకంపై బాపినీడు, సుధీర్ ఈదరలు సంయుక్తంగా నిర్మించారు. కాగా, ప్రస్తుతం విశ్వక్ సేన ఓరి దేవుడో అనే చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు