మూడు రోజుల్లో రూ. 450 కోట్లు దాటేసిన బాహుబలి-2.. హిందీలోనే 125 కోట్లు.. ఎవ్వరూ చెరపలేని రికార్డు అంటున్న అనలిస్టులు
సోమవారం, 1 మే 2017 (11:07 IST)
రాంగోపాల్ వర్మ ఏ ముహూర్తంలో భారతీయ సినిమాలను బాహుబలికి ముందు, ఆ తర్వాత అని రెండు యుగాలుగా విడదీయాల్సి ఉంటుందేమో అని అనుమానం వ్యక్తం చేశాడో కానీ సరిగ్గా దాన్ని మూడు రోజుల్లోనే నిరూపించిన సినిమాగా బాహుబలి2 చరిత్రలో నిలిచిపోయింది. సరిగ్గా మూడంటే మూడు రోజుల్లోనే ఏకంగా 450 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసిన సినిమా భారతీయ చలనచిత్ర చరిత్రలో ఇప్పటివరకు ఏదీ లేదు. ఆ ఫీట్ అసాధ్యం కాదని, కష్టం మాత్రమేనని బాహుబలి-2 నిరూపించింది. బాహుబలి మొదటి భాగం దాదాపు రూ. 650 కోట్ల వరకు వసూలు చేసిన తర్వాత రెండో భాగం ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు.
అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా.. దేశవ్యాప్తంగా అన్ని థియేటర్లలోనూ 90 శాతానికి పైగా ఆక్యుపెన్సీతో ఓపెన్ అయ్యింది. మొదటిరోజే ఈ సినిమాకు రూ. 121 కోట్ల కలెక్షన్లు వచ్చాయని హిందీ వెర్షన్ డిస్ట్రిబ్యూటర్ కరణ్ జోహార్ చెప్పారు. ట్రేడ్ ఎనలిస్టు రమేష్ బాలా కూడా ఈ సినిమా వసూళ్ల గురించి ట్వీట్ చేశారు. ఆదివారంతో ముగిసిన మొదటి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్త వసూళ్లు చూసుకుంటే రూ. 450 కోట్లు దాటిపోతాయని చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా శుక్ర, శని, ఆదివారం మూడంటే మూడు రోజుల్లో బాహుబలి2 ప్రపంచ వ్యాప్తంగా 450 కోట్ల రూపాయల వసూలు చేసిందని వార్తలు. ఒక్క హిందీలోనే మూడు రోజుల్లో 125 కోట్లు సాదించి బాలీవుడ్‌కి షాక్ తెప్పించింది. తొలిరోజు 41 కోట్లు, రెండో రోజు 42 కోట్లు, మూడో రోజు 42 కోట్లు వసూలు చేయడం. అదీ ఒక తెలుగు డబ్బింగ్ సినిమా ఈ స్థాయిలో కలెక్షన్ల సునామీని సృష్టించడం మహాద్బుతం అంటున్నారు ఫిలిం అనలిస్టులు
ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమా.. ఆమిర్ ఖాన్ నటించిన పీకే. దానికి రూ. 792 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఇప్పుడు కచ్చితంగా ఆ సినిమాను బాహుబలి-2 దాటేస్తుందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. శాటిలైట్, డిస్ట్రిబ్యూషన్ హక్కుల ద్వారానే ఈ సినిమాకు రూ. 500 కోట్ల వరకు వచ్చాయని చెబుతున్నారు.
తెలుగు, తమిళం, మళయాళం, హిందీ భాషలలో విడుదలైన ఈ సినిమా ఇక వసూళ్ల రికార్డులను ఏ స్థాయికి తీసుకెళ్తుందో చెప్పలేమని అంటున్నారు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ తదితరులు నటించిన ఈ సినిమా ప్రతిరోజూ సరికొత్త రికార్డులను సృష్టిస్తూనే ఉంది.
Follow
Ramesh Bala ✔ @rameshlaus
#Baahubali2 is the 1st movie to make it to Top 3 at the #NorthAmerica BO with less than 500 Theaters (425) lowest theater count.
Ramesh Bala ✔ @rameshlaus
#BaahubaliTheConclusion Hindi Opening Weekend BO Nett