మలయాళ బ్లాక్‌బస్టర్ ప్రేమలుతో అలరించిన నస్లెన్ 'జింఖానా'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇది ఇప్పటికే మలయాళంలో బాక్సాఫీస్ వద్ద బిగ్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ స్పోర్ట్స్-ప్యాక్డ్, యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ఏప్రిల్ 25న తెలుగు థియేటర్లలోకి రానుంది. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమా ట్రైలర్‌ను లాంచ్ చేశారు.
ట్రైలర్ మొత్తం వైబ్ - ఫన్ , ఫైట్ లతో అడిరిపోయింది. కొంతమంది యువకులు బాక్సింగ్ క్లాస్ కోసం సైన్ అప్ చేస్తారు, ఇదంతా సరదా , ఆటలు అని భావిస్తారు. వారు తమ నో నాన్సెన్స్ కోచ్‌ను కలిసినప్పుడు సీరియస్ బిజినెస్ గా మారుతుంది. శిక్షణ ప్రారంభమైన కొద్దీ జీవిత పాఠాలు తెరపైకి వస్తాయి. బాక్సింగ్ అంటే పంచ్‌లు విసరడం మాత్రమే కాదని - ఇది క్రమశిక్షణ, విల్ పవర్ అని తెలుసుకుంటారు. వారిలో నిజంగా ఫైర్ పడుతుంది? తర్వాత ఏం జరిగిందనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
దర్శకుడు ఖలీద్ రెహమాన్ హ్యుమర్, సోల్, ఎక్సయిట్మెంట్, హై ఎనర్జీతో కూడిన పోరాట సన్నివేశాలను బ్లెండ్ చేసి, దీనిని అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ గా రూపొందించారు. నస్లెన్ తన చార్మ్ తో గ్యాంగ్ ని నడిపిస్తాడు మొత్తం తారాగణం అమాయకత్వం, రియలిజంని తెరపైకి తెస్తుంది.
ఖలీద్ రెహమాన్, జోబిన్ జార్జ్, సమీర్ కారత్, సుబీష్ కన్నంచెరి ఈ చిత్రాన్ని నిర్మించారు.
తారాగణం: నస్లెన్, లుక్మాన్ అవరన్, గణపతి, సందీప్ ప్రదీప్, అనఘ మాయ రవి, ఫ్రాంకో ఫ్రాన్సిస్, హబీష్ "బేబీ జీన్" రెహమాన్, శివ హరిహరన్, విశ్వజిత్, ఆరబ్