కాలక్రమేణా వారంతా ఒక్కొక్కరుగా దూరమయ్యారు. ఫైనల్ గా నేను ఒక్కడినే మిగిలాను. ఇక్కడ ప్రతీ రూపాయి చాలా కష్టపడాలి, ఖర్చుకూడా జాగ్రత్త గా పెట్టాలి. ఆ తర్వాత ఎ స్. ఆర్. కళ్యాణ మండపం తీశాను. ఆ తర్వాత ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూశాను. ఇప్పుడు క సినిమాతో స్థిరపడ్డాను. త్వరలో నేను చేసిన దిల్ రుబా విడుదలకాబోతుంది. అందుకే నేను ఓ నిర్ణయాన్ని తీసుకున్నా.
సినిమాపై కసి, పట్టుదలతో టాలెంట్ వున్నవారిని ఏడాదికి పదిమందిని సాయం చేయాలని నిర్ణయించుకున్నా. సీనియర్ హీరోలు ఇలా సాయం చేశారు. స్పూర్తిగా నేను ఏదో చేయాలని అనుకుంటున్నా. ఈ రోజు నుంచి ఓ మాట ఇస్తున్నా. ప్రతి ఏడాది మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వారికి ఫైనాన్షియల్ గా ఇబ్బందిపడేవారికి ఫుడ్, స్టేకాబచ్చు, స్కిల్ సెట్ కావచ్చు. వారిని ఆదుకుంటున్నానని చెప్పారు. ఇక్కడ పి.జి.కి డబ్బులు కట్టుకోలేక, తినడానికి లేకుండా తిరిగి వెళ్ళిపోతున్న వారిని ఆదుకోవాలని డిసైడ్ అయ్యాను అని తెలిపారు. కొత్తవారితో సినిమాలు చేయడానికి సిద్ధంగా వున్నాను అన్నారు.