రణ్ బీర్ కపూర్ సరసన నటించిన యానిమల్, అల్లు అర్జున్ కు జోడీగా చేసిన పుష్ప 2, వికీ కౌశల్ తో కలిసి నటించిన ఛావా ఘన విజయాలు సాధించాయి. ఈ మూడు చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకుంది రశ్మిక మందన్న.
ముగ్గురు స్టార్ హీరోలతో మూడు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన రశ్మికకు సోషల్ మీడియాలో అప్రిషియేషన్స్ దక్కుతున్నాయి. ఈ సక్సెస్ లు కొనసాగిస్తూ ప్రస్తుతం తన క్రేజీ లైనప్ కంటిన్యూ చేస్తోంది రశ్మిక. సల్మాన్ ఖాన్ సరసన సికిందర్, నాగార్జున, ధనుష్ హీరోలుగా దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న కుబేర సినిమాలతో తో పాటు ది గర్ల్ ఫ్రెండ్ మూవీ లో నటిస్తోంది.