తాజాగా ఈ పాట చిత్రీకరణకు సంబంధించిన స్టిల్‌ను గోపీచంద్ మలినేని ట్విట్టర్‌లో షేర్ చేశాడు. మాస్ రాజా రవితేజ, జానీ మాస్టర్, అప్సరా రాణి కాంబోలో ప్రేక్షకుల్లో జోష్ నింపేందుకు మాస్ సాంగ్ రాబోతుందని చెప్పాడు గోపిచంద్. సెట్స్‌లో అప్సరా రాణి స్టన్నింగ్ లుక్‌లో మెస్మరైజ్ చేస్తుండగా.. రవితేజ, జానీ, గోపీచంద్ బ్లాక్ డ్రెస్సుల్లో కలిసి దిగిన సెల్పీ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
రవితేజ, శృతిహాసన్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ లాక్‌డౌన్ తరవాత తిరిగి ప్రారంభమైంది. ఈ షూటింగ్ మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక సినిమా కూడా ఓటీటీలో విడుదల కానుందని పలు వార్తలు ప్రచారమవుతున్నాయి. అన్యాయాన్ని ఎదురించే నిజాయితీపరుడైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో’ రవితేజ కనిపించబోతున్నాడు.