ఇదిలా వుండగా, ప్రస్తుతం సేఫ్ జోన్‌లో ఉన్నామని, సినిమా బడ్జెట్‌లో ఎక్కువ భాగాన్ని తిరిగి పొందామని నిర్మాతలు చెబుతున్నారు. అయితే, గత కొన్ని రోజులుగా కలెక్షన్లు కొద్దిగా తగ్గాయి. ఆక్యుపెన్సీ గణనీయంగా తగ్గింది. మండుతున్న వేడి కారణంగా, ప్రేక్షకులు ఎక్కువగా ఇంటి లోపలే ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్ మరీ దారుణంగా వుంది. అక్కడ తీవ్ర వడగాడ్పులు రావడంతో బయటకు జనాలు రావడంలేదు. కాబట్టి, రాబోయే రోజుల్లో ఈ సినిమా ఎంత వసూళ్లు చేస్తుందో వేచి చూడాలి. ఇప్పటికే పలు సినిమాలకు థియేటర్ల రాకపోవడంతో వెలవెల బోతున్నాయి.