vedhikha, Arvind Krishna, Murali Mohan, Harita Gogineni and others
హీరోయిన్ వేదిక లీడ్ రోల్ లో నటిస్తున్న "ఫియర్" మూవీ ఇవాళ హైదరాబాద్ లో గ్రాండ్ గా లాంఛ్ అయ్యింది. ఈ సినిమాను దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్ ఏఆర్ అభి నిర్మిస్తున్నారు. సుజాత రెడ్డి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథతో దర్శకురాలు హరిత గోగినేని ఫియర్ మూవీని రూపొందిస్తున్నారు. అరవింద్ కృష్ణ ఓ స్పెషల్ రోల్ లో కనిపించనున్నారు.
ఈ సినిమా ప్రారంభోత్సవ పూజా కార్యక్రమంలో నటులు మురళీ మోహన్ పాల్గొని స్క్రిప్ట్ అందించగా...డైరెక్టర్ కరుణాకరన్ క్లాప్ నిచ్చారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ తేజ కాకుమాను, హీరో సోహైల్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా
హీరోయిన్ వేదిక మాట్లాడుతూ - ఫియర్ మూవీ షూటింగ్ కోసం ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నాను. ఈ సినిమాలో సస్పెన్స్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉంటాయి. నా క్యారెక్టర్ మల్టీ డైమెన్షన్స్ తో ఉంటుంది. నేను తెలుగులో కాంచన, రూలర్ సినిమాల్లో నటించాను. ఓ వెబ్ సిరీస్ చేశాను కానీ సస్పెన్స్ థ్రిల్లర్ కథలో నటించలేదు. డైరెక్టర్ హరిత గోగినేని ఎడ్జ్ ఆఫ్ సీట్ థ్రిల్లర్ స్క్రిప్ట్ రెడీ చేశారు. ఈ కథ నాకు చెప్పినప్పుడు బాగా ఇంప్రెస్ అయ్యాను. స్టోరీ, క్యారెక్టర్స్ డిజైన్ లో హరిత చాలా క్లారిటీగా ఉన్నారు. కొత్త డైరెక్టర్ అని నాకు అనిపించలేదు. దత్తాత్రేయ మీడియా సంస్థలో పనిచేయడం హ్యాపీగా ఉంది. అవార్డ్ విన్నింగ్ ఆర్టిస్టులు, మంచి టెక్నీషియన్స్ తో ఫియర్ మూవీ చేస్తున్నాం. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం. అని చెప్పింది
డైరెక్టర్ హరిత గోగినేని మాట్లాడుతూ - డైరెక్షన్ చేయడం అనేది నా డ్రీమ్ కాదు డెస్టినీ అనుకుంటాను. దత్తాత్రేయ మీడియా నా ఫ్యామిలీ బ్యానర్ లాంటిది. ఇవాళ మా ఫియర్ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభోత్సవం చేసుకోవడం హ్యాపీగా ఉంది. ప్రేక్షకులకు ఎలాంటి సినిమా నచ్చుతుంది అనేది ఆలోచిస్తూ ఏడాదిపాటు ఈ సినిమాకు స్క్రిప్ట్ రెడీ చేశాను. ఈ స్క్రిప్టుకు వేదిక లాంటి మంచి హీరోయిన్ దొరకడం సంతోషంగా ఉంది. సినిమా పట్ల ఆమెకున్న డెడికేషన్ చూస్తుంటే ఎంతో ఎంకరేజింగ్ గా ఉంది. మంచి టీమ్ నాకు దొరికింది. వీరి సహాయంతో నేను అనుకున్న స్క్రిప్ట్ తో ఇన్ టైమ్ లో సినిమా రూపొందించి ప్రేక్షకులకు నచ్చేలా స్క్రీన్ మీదకు తీసుకురావాలని భావిస్తున్నాను. అని చెప్పింది.
నిర్మాత ఏఆర్ అభి మాట్లాడుతూ - హరిత నా వైఫ్. మా సంస్థలో లక్కీ లక్ష్మణ్ సినిమాకు వర్క్ చేసింది. ఆ మూవీకి చాలా క్రాప్ట్స్ సూపర్ విజన్ చేసేది. ప్రతి పనిలో డెడికేటెడ్ గా ఉంటుంది. ఆమె డైరెక్షన్ కూడా పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేయగలదు అని నమ్మకం ఉంది. ఫియర్ స్క్రిప్ట్ ను చాలా బాగా రాసుకుంది. ఆ స్క్రిప్ట్ ను యాక్సెప్ట్ చేసి హరితకు సపోర్ట్ చేస్తున్న వేదిక గారికి థ్యాంక్స్. ఆమె ఛాలెంజింగ్ క్యారెక్టర్ లో కనిపించబోతోంది. అలాగే అరవింద్ కృష్ణ స్పెషల్ రోల్ చేస్తున్నాడు. తను హీరో అయినా..మేము ఈ స్క్రిప్ట్ చెప్పగానే ఓకే అని చేసేందుకు ముందుకొచ్చాడు. మా సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన అతిథులు మురళీ మోహన్, కరుణాకరన్, తేజ కాకుమాను, హీరో సోహైల్..అందరికీ థ్యాంక్స్. అన్నారు.
హీరో అరవింద్ కృష్ణ మాట్లాడుతూ - ఫియర్ మూవీలో ఒక స్పెషల్ రోల్ లో నటిస్తున్నాను. డైరెక్టర్ హరిత గారు ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు చాలా క్లారిటీగా ప్రతి సీన్ కళ్ల ముందు చూస్తున్నట్లు అనిపించింది. ఈ మూవీలో పార్ట్ అవడం హ్యాపీగా ఉంది. మా సినిమా బ్యానర్ లో రాసినట్లు..ఎంటర్ టైన్ మెంట్ గ్యారెంటీగా ప్రేక్షకులకు అందిస్తాం. వేదిక గారితో కలిసి పనిచేస్తున్నాను. అలాగే నా ఫేవరేట్ సినిమాటోగ్రాఫర్ ఆండ్రూ గారితో వర్క్ చేయడం సంతోషంగా ఉంది. అనూప్ గారు మంచి మ్యూజిక్ చేస్తున్నారు. ఒక సాంగ్ ఆల్రెడీ విన్నాను. అద్భుతంగా వచ్చింది. అన్నారు.
సినిమాటోగ్రాఫర్ ఐ ఆండ్రూ మాట్లాడుతూ - నేను ప్రొడ్యూసర్ అభితో లక్కీ లక్ష్మణ్ మూవీ చేసాను. ఇప్పుడు హరిత గారి డైరెక్షన్ లో ఫియర్ కు వర్క్ చేస్తున్నాను. నేను ఇప్పటిదాకా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీకి పనిచేయలేదు. ఈ సినిమా కోసం ఒక కొత్త లైటింగ్ ప్యాట్రన్, షాట్స్ ట్రై చేస్తున్నాను. వేదికతో నేను వర్క్ చేస్తున్న రెండో మూవీ ఇది. ఫియర్ మీకు నచ్చేలా ఉంటుందని ఆశిస్తున్నాను. అన్నారు.