నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ ఆయ్..ఇది పక్కా గోదావరి జిల్లాల సినిమా. సినిమా థియేటర్ నుంచి బుగ్గలు, పొట్ట నొప్పితో బయటకు వస్తారని నేను గ్యారంటీగా చెప్పగలను. పిఠాపురంలో సినీ వేడుకను నిర్వహించి కొత్త అడుగుకి వేశాం. భవిష్యత్తులో ఈ బాటలో మరింత మంది అడుగులు వేస్తారని నమ్ముతున్నాను. రామ్ మిర్యాలగారిది పిఠాపురం అనేది నాకు తెలియదు. ఈ సినిమా సందర్భంలో ఆయన్ని కలిసినప్పుడే తెలిసింది. ఇక్కడ వ్యక్తి కాబట్టే నాయకి అనే సాంగ్‌తో పాటు మరో సాంగ్‌ను అద్భుతంగా కంపోజ్ చేశారు అన్నారు.
హీరోయిన్ నయన్ సారిక మాట్లాడుతూ నేను తెలుగు అమ్మాయిని కాకపోయినా ఆయ్ టీమ్‌తో వర్క్ చేయటం వల్ల తెలుగు అమ్మాయిగా మారిపోయాను. సినిమా గురించి చెప్పాలంటే.. గోదావరి జిల్లాల్లో ప్రజలు అన్నీ ఎమోషన్స్‌కు ఎలాగైతే ఆయ్ అంటారో.. అలాంటి ఎమోషన్స్ అన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. సినిమాను కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అది మా టీమ్ చేస్తోన్న ప్రామిస్ అన్నారు.
దర్శకుడు అంజి కె.మణిపుత్ర మాట్లాడుతూ ఆయ్ ట్రైలర్‌లో ఎంతగా నవ్వించామో, సినిమా అంతా అలాగే ఎంజాయ్ చేస్తారో. నవ్వుతూనే చిన్న చిన్న ఎమోషన్స్‌ను చూపించాం. నిర్మాత బన్నీవాస్‌గారు ఎంతో సపోర్ట్ అందించారు. రామ్ మిర్యాలగారికి థాంక్స్. ఆయన కంపోజ్ చేసిన రంగనాయకి, సూఫీ పాటలకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే అజయ్ అరసాడ సినిమాకు అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అందించారు. సినిమా కో ప్రొడ్యూసర్స్ రియాజ్, భాను ప్రతాప్‌గారికి, నిర్మాతల్లో ఒకరైన విద్యా కొప్పినీడిగారికి, చిత్ర సమర్పకులు అల్లు అరవింద్‌గారికి థాంక్స్ అన్నారు.
హీరో నార్నే నితిన్ మాట్లాడుతూ ఆయ్ ట్రైలర్ అందరికీ నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. మమ్మల్ని చెట్లు ఎక్కించటం, బురదలో పడేయటం వంటి పనులను మా డైరెక్టర్ చేశారు. ఆయనపై కోపాన్ని మళ్లీ తీర్చుకుంటాను. మా కష్టానికి ఫలితాన్ని మీరు అందరూ, సినిమా సక్సెస్ రూపంలో ఇవ్వాలని కోరుకుంటున్నాను. సినిమా టీజర్, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ ఉందంటే కారణం మా డైరెక్టర్, నిర్మాతలే. అంకిత్, కసిరెడ్డి లేకపోతే ఈ సినిమా లేదనే చెప్పాలి. పిల్లర్స్‌లా వాళ్లు కష్టపడ్డారు. ఈ సందర్భంగా వాళ్లకి థాంక్స్. నయన్ సారిక తెలుగు అమ్మాయి కాకపోయినా, తను ఇరగ్గొట్టేసింది. రేపు సినిమాను చూసి అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు.