దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం బాహుబలి. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కనక వర్షం కురిపించింది. కలెక్షన్ల పరంగా కుమ్మేసింది. తెలుగు సినిమా ఖ్యాతిని దశదిశలు వ్యాపించేలా చేసింది. ఈ సినిమాలో ప్రభాస్ బాహుబలిగా కనిపిస్తే, రానా భల్లాలదేవుడుగా , రమ్యకృష్ణ శివగామిగా, v దేవసేనగా, సత్యరాజ్ కట్టప్పగా, తమన్నా అవంతిక పాత్రలలో కనిపించి మెప్పించారు.