అల్లు అర్జున్ (బన్నీ)ని నవదీప్ బావ! అంటూ సంబోధిస్తాడు. కుటుంబసభ్యుడిలా కలిసివుంటారు. అన్ని విషయాల్లో సరదాగా వుంటారు. అందుకే ఆయన గురించి తెలీని విషయం ఏదైనా చెప్పమన్నప్పుడు నవదీప్ ఇలా స్పందించారు. ఆయనలో తెలీని విషయం ఏమీలేదు. అంతా ఓపెన్, బన్నీది, నాది ఓపెన్ బుక్. చాలా సరదాగా వుంటాడు. కింద స్థాయినుంచి పైకి కష్టపడి ఎదిగాడు. చరణ్‌ను, బన్నీని దగ్గరుండి చూశా. వారికున్న పవర్, స్టేటస్, క్రేజ్, ఇమేజ్‌చూసుకుంటే, ఒక్క మాట వేసే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా ఎలా వుండాలో నేను నేర్చుకున్నా` నంటూ పేర్కొన్నారు.