సౌత్ కొరియోగ్రాఫర్, పాన్ ఇండియా కొరియోగ్రాఫర్‌పై ఇలాంటి ఆరోపణలు రావడం కాస్త జీర్ణించుకోలేని విషయమేనని చెప్పారు. తమ మధ్య యూనియన్ గొడవలు వున్నాయే తప్ప.. ఆయనతో వ్యక్తిగతంగా ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. మహిళలను గౌరవించాలని తెలిపారు. అసిస్టెంట్, సైడ్ యాక్టర్లపై జాలి చూపాలని, కొరియోగ్రాఫర్‌గా ఎదగాలంటే అంత సులువు కాదని.. అంత ఉన్నత స్థాయికి చేరుకుని ఇలా చీప్ ట్రిక్స్ ప్లే చేయడం తప్పన్నారు.
ఇంకా అసిస్టెంట్ కొరియో గ్రాఫర్లను ఇలా వాడటం, మహిళలను వేరేగా చూడటం వంటివి సరికాదన్నారు. నిజాలేంటో తెలిశాక.. ఆ అమ్మాయి తరపున మద్దతిస్తామని చెప్పారు. సినిమా ఇండస్ట్రీకి వచ్చి అమ్మాయిలు చేసేదేమీ లేదని.. కానీ బాధపడి వెళ్లినోళ్లు చాలామంది వున్నారని తెలిపారు. లక్షల్లో ఇన్ స్టాలో ఫాలోవర్స్ వస్తే గొప్ప అనుకోవడం కాదని.. లక్ష ఫాలోవర్స్ వేస్టని.. సినిమా ఫీల్డ్‌కు వస్తే ప్రతి ఒక్కడూ.. సి అంటే సిగ్గుండదు. ని అంటే నిజాయితీ వుండదు. మ అంటే మానం వుండదు.. అన్నింటికి తెగబడి సినిమా ఫీల్డుకు రావాలి.