సినిమాలకు దూరంగా వుండి సోషల్ మీడియాలో బికినీలతో దర్శనమిస్తూ కుర్రకారుని ఉత్సాహపరుస్తున్న ఇలియానా చీరలంటే ఇష్టమంటోంది. గురువారంనాడు వైజాగ్ వచ్చింది. ప్రముఖ డిజైనర్ శశి వంగపల్లి తన ముగ్ధ స్టోర్‌ను వైజాగ్ నగర వాసులకు అందుబాటులో కి వచ్చింది. ఇప్పటికే తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో ముగ్ధ డిజైనర్ స్టూడియో ని ఏర్పాటు చేసి ఫ్యాషన్ ప్రియుల ఆదరాభిమానాలను పొందిన శశి వంగపల్లి ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన నగరమైన విజయవాడ, వైజాగ్ వాసుల కోసం తన ముగ్ధ స్టోర్‌ను అందుబాటులోకి తెస్తున్నారు.