కట్ చేస్తే, వాల్తేరు వీరయ్య ప్రీరిలీజ్ ఫంక్షన్ వైజాగ్‌లో జరిగినప్పుడు ఆయన మాట్లాడుతూ, నాకు రిటైర్ అయ్యాక ఇలాంటి ప్రాంతంలో వాతావరణంలో వుండాలనుందని వ్యాఖ్యానించారు. దీనికి రాజకీయ రంగుకూడా పులుముకుంది. ఆ వెంటనే వైసిపి నాయకుడు జగన్ బంధువు మాట్లాడుతూ, చిరంజీవిగారు ఇలా మాట్లాడినందుకు మేం స్వాగతిస్తున్నాం. చిరంజీవిగారి సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నాం అంటూ తెలిపారు.
ఇక బుధవారంనాడు చిరంజీవి మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఓ విలేకరి అడుగుతూ, ఈమధ్య మీరు రిటైర్‌మెంట్ గురించి మాట్లాడుతున్నారు. ఇది అవసరమా? అని అంటే.. నేను రిటైర్‌మెంట్ అనేది అందరినీ దృష్టిలో పెట్టుకుని చెప్పాను. తపన వుండాలి. మొదటి సినిమాకు ఎలా పనిచేశామో అంతే ఇదిగా చేయాలి అన్నారు.