చిరంజీవి, నయనతారలపై ఓ కలర్‌ఫుల్, మెలోడియస్ మాంటేజ్ సాంగ్‌ని చిత్రీకరిస్తున్నారు. భీమ్స్ సెసిరోలియో అద్బుతమైన సాంగ్ ని కంపోజ్ చేశారు. పెళ్లి సందడి నేపథ్యంలో జరగుతున్న ఈ పాట పూర్తిగా జాయ్‌ఫుల్, సెలబ్రేటరీ మూడ్‌లో సాగుతుంది. అలాగే కొన్నికీలకమైన సీన్లను కూడా ఈ షెడ్యూల్‌లో షూట్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ షూటింగ్ జూలై 23కి పూర్తవుతుంది.
ఇటీవల రిలీజ్ చేసిన ప్రోమోలో చిరంజీవి వింటేజ్, స్టైలిష్ లుక్‌లో అలరించారు. దర్శకుడు అనిల్ రావిపూడి స్టైల్‌కి తగ్గట్టుగా షూటింగ్ స్పీడుగా, ప్లాన్‌డ్‌గా జరుగుతోంది. సినిమా మంచి నస్టాల్జిక్ ఫీల్‌తో ఉండబోతోంది.
ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీం పని చేస్తోంది. సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్. ఎస్. కృష్ణ, జి. ఆది నారాయణ కో రైటర్స్. ఎస్. కృష్ణ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్.