చియాన్ విక్రమ్ హీరోగా నటించిన భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా "తంగలాన్" ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో "తంగలాన్" స్ట్రీమింగ్ అందుబాటులో ఉంది. ఆగస్టు 15న థియేటర్స్ లోకి వచ్చిన "తంగలాన్" చియాన్ విక్రమ్ కెరీర్ లో హయ్యెస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ అందుకుంది. బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల రూపాయల కలెక్షన్స్ మార్క్ ను దాటింది. నెట్ ఫ్లిక్స్ లోనూ ఈ సినిమా మంచి ఆదరణ పొందనుంది.