బుల్లితెర షోలలో డ్యాన్స్ షోలకు అభిమానులు ఎక్కువే. అందులోను ఈటీవీ లాంటి ఛానళ్ళు టెలికాస్ట్ చేసే డ్యాన్స్ షోలంటే అభిమానులు పడి చచ్చిపోతుంటారు. ఢీ డ్యాన్స్ షోకి అభిమానులు లక్షలాదిమందే ఉన్నారు. ఈ షోకు రెగ్యులర్‌గా చూసే అభిమానులు లేకపోలేదు. అయితే ఆ షోలో ఈ మధ్య శృంగార సన్నివేశాలు కనిపిస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. న్యాయనిర్ణేతలే ఆశ్చర్యపోయేలా కొన్ని డ్యాన్స్ షోలు నడుస్తున్నాయి.
ఈ షోలో ఉన్న యాంకర్లు సుధీర్, రేష్మిలు అద్భుతంగా యాంకరింగ్ చేస్తూ అందరినీ అలరించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇందులో ఉన్న సన్నివేశాలను కుటుంబ సభ్యుల మధ్య కూర్చుని చూడలేకపోతున్నారు. ఇలాంటివి శృతి మించక ముందే షో నిర్వాహకులు స్పందించాలంటూ కొంతమంది అభిమానులు ఆ టీవీ యజమానులకు మెసేజ్‌లు పంపుతున్నారట. లక్షలాది మంది అభిమానులు చూస్తున్న ఈ షోను నడుపుతారో లేక అందులో పార్టిసిపేట్ చేస్తున్న వారికి క్లాస్ పీకుతారో వేచి చూడాల్సిందే.