కరోనా క్రైసిస్ లో సినీపరిశ్రమ కార్మికులు సహా ఆపదలో ఉన్న ఎందరినో మెగాస్టార్ చిరంజీవి ఆదుకున్నారు. ఇప్పుడు మరోసారి మెగాస్టార్ ఆపత్కాల సాయం పరిశ్రమలో చర్చనీయాంశమైంది. దర్శకరత్న డా.దాసరి నారాయణరావు కోడైరెక్టర్ (లంకేశ్వరుడు చిత్రానికి కో డైరెక్టర్) గా పని చేసిన ప్రభాకర్ కి ఆపత్కాలంలో మెగాస్టార్ చిరంజీవి బృందం ఆర్థిక సాయం చేశారు. వారి పాప చదువుకు అవసరమైన ఫీజుల సాయం చేసి ఆదుకున్నారు.