ఈ ప్రశ్నకు రానా దాట వేయకుండా చమత్కారంతో బదులిచ్చాడు. బాహుబలిని కట్టప్ప చీకట్లో చంపేశాడని.. ఆ చీకట్లో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలియరా లేదని.. ఆ చీకట్లో తనకు ఆ దృశ్యం సరిగా కనిపించలేదని, ఎందుకు చంపాడో తెలియలేదని రానా సమాధానం ఇచ్చాడు.
అంతేగాకుండా వెండితెరపై వెలుతురు ఉంటుందని అందులో చూడాలని ఉచిత సలహా కూడా ఇచ్చాడు రానా. బాహుబలి-2లో తనకు అనుష్క యాక్షన్ బాగా నచ్చిందన్నాడు. బాహుబలి-1లో యుద్ధ సన్నివేశాల వంటి రిస్కీ యాక్షన్ దృశ్యాలు చేయడం తొలి ప్రయత్నం కావడంతో కాస్త కష్టపడ్డానని.. కానీ రెండో పార్టులో ఆ బాధ తప్పిందని.. యాక్షన్, యుద్ధ సన్నివేశాలు సులభం చేసేశానని చెప్పుకొచ్చాడు. బాహుబలి 2 తప్పకుండా హిట్ కొడుతుందని.. అంతర్జాతీయ ఖ్యాతిని సొంతం చేసుకుంటుందని తెలిపాడు.