ఈ సినిమాలో స్టార్ హీరో విక్రమ్, మరో స్టార్ జయంరవి, ఐశ్వర్యా రాయ్, ఐశ్వర్యా లక్ష్మీ, శరత్ కుమార్, పార్తీబన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే చాలా భాగం పూర్తయింది. కోవిడ్ వలన ఆలస్యమైంది. కాగా, ఈ షెడ్యూల్ లో హీరో కార్తీతో పాటు త్రిష, ప్రకాశ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. వారి పై కొన్ని కీలక సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రం తొలి భాగం వచ్చే ఏడాది రిలీజ్ కాబోతుంది.