డాన్-3లో ప్రియాంక చోప్రా కాదు.. కియారా అద్వానీకి ఛాన్స్

సెల్వి

మంగళవారం, 20 ఫిబ్రవరి 2024 (12:24 IST)
Kiara Advani
బాలీవుడ్ ప్రాజెక్ట్ డాన్-3 గురించి తాజా అప్డేట్ వచ్చింది. ప్రముఖ దర్శకుడు ఫర్హాన్ అక్తర్- అతని బ్యానర్ ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి డాన్ 3లో నటించే హీరోయిన్ ఎవరనే దానిపై క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఒక చిన్న క్లిప్‌ను పంచుకుంటూ, ఫర్హాన్, ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ డాన్ 3లో రణవీర్‌ సింగ్‌కు జోడీగా కియారా అద్వానీ ప్రధాన పాత్రలో కనిపించనుందని స్పష్టం చేశారు.  
 
ఈ సినిమాలో ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుందని గతంలో వార్తలు వచ్చాయి.  అయితే ఈ చిత్రంలో నటించే అవకాశం ప్రియాంకను వరించలేదు. చివరికి కియారా అద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది. డేట్స్ కారణంగా ప్రియాంక చోప్రా ఈ సినిమాలో నటించలేకపోయిందని టాక్ వస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు