ప్రమోషనల్ కంటెంట్ తో ఇప్పటికే భారీ అంచనాలు పెంచిన ఈ చిత్రం విడుదల తేదిని తాజాగా నిర్మాతలు ఖరారు చేశారు. ఆగస్టు 5న 'సీతా రామం' ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషల్లో ఒకేసారి ఈ చిత్రం విడుదల చేస్తున్నారు.
తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రానికి పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. అడిషనల్ సినిమాటోగ్రఫీని శ్రేయాస్ కృష్ణ అందిస్తున్నారు.
తారాగణం: దుల్కర్ సల్మాన్, మృణాళిని ఠాకూర్, రష్మిక మందన్న, సుమంత్, గౌతమ్ మీనన్, ప్రకాష్ రాజ్, తరుణ్ భాస్కర్, శత్రు, భూమిక చావ్లా, రుక్మిణి విజయ్ కుమార్, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ తదితరులు
సాంకేతిక విభాగం: దర్శకత్వం: హను రాఘవపూడి, నిర్మాత: అశ్వినీదత్, బ్యానర్: స్వప్న సినిమా, సమర్పణ: వైజయంతీ మూవీస్, ఛాయాగ్రహణం : పీఎస్ వినోద్, శ్రేయాస్ కృష్ణ, సంగీతం: విశాల్ చంద్రశేఖర్, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ డైరెక్టర్: వైష్ణవి రెడ్డి, ఫైసల్ అలీ ఖాన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గీతా గౌతమ్