పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తున్న ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించలేరా అంటూ ప్రశ్నించింది. పైగా, అన్ని రంగాల్లోనే కాకుండా, దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ప్లాస్టిక్ వ్యర్థాలపై నిషేధం విధించడం సాధ్యపడదా అని ప్రశ్నించింది. దీనికి కేటీఆర్ తక్షణం స్పందించారు.
ఈషా చేసిన ట్వీట్‌లో 'భారతదేశంలో ఏయే రాష్ట్రాలు ప్లాస్టిక్‌ను బ్యాన్ చేశాయి? పలు రంగాల్లో అగ్రగామిగా నిలుస్తున్నమన తెలంగాణ రాష్ట్రం పేరు ఈ జాబితాలో లేకపోవడం నాకు నిరాశ కలిగించింది. ప్లాస్టిక్ నిషేధంపై దృష్టి సారించి భావి తరాలకు మంచి భవిష్యత్తును అందించేందుకు కృషి చేయాలి' అని కోరుతూ మంత్రి కేటీఆర్‌కు ఈషా ట్వీట్ చేసింది.
ఈ ట్వీట్‌పై కేటీయార్ తక్షణమే స్పందించారు. 'చట్టప్రకారం నిర్ణయం తీసుకున్నంతమాత్రన ప్లాస్టిక్ నిషేధం అనేది జరిగే పనికాదు. ప్లాస్టిక్ నిషేధం పక్కాగా అమలు కావాలంటే.. అధికారులకు, ప్రజలకు, ప్లాస్టిక్ తయారీదారులకు సమస్య తీవ్రత గురించి అవగాహన కలగాలి' అంటూ కేటీఆర్ సమాధానమిచ్చారు.
తన ట్వీట్‌కు క్షణాల్లో కేటీఆర్ స్పందించడంపై ఈషా తెగ సంబరపడిపోయింది. 'ఇంత త్వరగా స్పందించినందకు ధన్యవాదాలు సర్. సమర్థమైన, ప్రతిభావంతమైన మీలాంటి యువనాయకులు ఉండగా ఇది అసాధ్యం అని నేననుకోవడం లేదు. ప్లాస్టిక్ నిషేధంలో కూడా మన రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలని కోరుకుంటున్నాను' అని ఆకాంక్షిస్తూ ఈషా ట్వీట్ చేసింది.